నకిరేకల్, కట్టంగూర్ : హైదరాబాద్–విజయవాడ 65వ నంబర్ జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణ కోసం సర్వీస్ రోడ్లు నిర్మించాలని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ సూచించారు. నకిరేకల్‌లోని పద్మానగర్ జంక్షన్ వద్ద, కట్టంగూర్‌లో నల్లగొండ క్రాస్ రోడ్డు, కురుమర్తి క్రాస్ రోడ్డును బుధవారం ఆయన చౌదరి కంపెనీ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ మూడు చోట్ల సర్వీస్ రోడ్లు లేక ప్రజలు రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారని గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు నిర్మించాలని, హైవేపై అన్ని జంక్షన్ల వద్ద హైమాస్ట్ లైట్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ అమర్చాలని ఆదేశించారు. రాత్రి వేళ్ల రహదారిపై వాహనాలు నిలిపి ఉండకుండా పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ శివరాంరెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, కట్టంగూర్ ఎస్‌ఐ రవీందర్, హైవే రెసిండింట్ ఇంజనీర్లు కిషన్‌రావు, జోగేంద్ర, చౌదరి కంపెనీ మేనేజర్ నాగకృష్ణ, రాంకుమార్, సంజీవచౌదరి, పోలిశెటి అంజయ్య తదితరులు ఉన్నారు.
ఫ ఎస్పీ శరత్ చంద్రపవార్