
మాట్లాడుతున్న కూనంనేని సాంబశివరావు
దురాజ్‌పల్లి (సూర్యాపేట): ప్రజా సమస్యలపై కప్పల లింగమ్మ చేసిన పోరాటం చిరస్మరణీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కప్పల లింగమ్మ సంతాపసభకు ఆయన హాజరై మాట్లాడారు. సీపీఐ తరఫున కప్పల లింగమ్మ అనేక ప్రజా ఉద్యమాలకు నాంది పలికారన్నారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ ఆమె ప్రత్యక్షమై నిస్వార్ధంగా ప్రజాసేవకు అంకితమయ్యిందన్నారు. లింగమ్మ ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పల్లా వెంకట్‌రెడ్డి, నాయకులు బొమ్మగాని ప్రభాకర్, గన్న చంద్రశేఖర్, పల్లె నరసింహ, బెజవాడ వెంకటేశ్వర్లు, సత్యం, అనంతుల మల్లేశ్వరి, బూర వెంకటేశ్వర్లు, బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఫ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు