ఈ–పాలనతో మెరుగైన సేవలు | - | Sakshi
Sakshi News home page

ఈ–పాలనతో మెరుగైన సేవలు

Feb 3 2024 12:48 AM | Updated on Feb 3 2024 12:48 AM

సమావేశానికి హాజరైన అధికారులు
 - Sakshi

సమావేశానికి హాజరైన అధికారులు

6న సెమినార్‌

సూర్యాపేట జిల్లాలోని డ్రాయింగ్‌–డిస్‌బర్స్‌మెంట్‌ అధికారుల (డీడీఓల)కు ఆదాయ పన్ను శాఖ ఆధ్వర్యంలో ట్యాక్స్‌ డెడికేటెడ్‌ ఎట్‌ సోర్స్‌(టీడీఎస్‌)పై ఈ నెల 6 ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో సెమినార్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ సెమినార్‌కు అన్ని శాఖల డీడీఓలు హాజరుకావాలని సూచించారు.

దురాజ్‌పల్లి (సూర్యాపేట): ఈ–పరిపాలన ద్వారా ప్రత్యేక అధికారులు ఆకస్మిక పర్యటనలు చేసి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చేశారని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డితో కలిసి జిల్లా ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ–పరిపాలనలో భాగంగా ఈ–ఆఫీస్‌, ఈ–పరిశీలన, వెబెక్స్‌ ద్వారా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించామన్నారు. జిల్లా ప్రత్యేక అధికారులు గ్రాఫ్‌ తయారు చేసి ఇవ్వాలని వీటిని ఒక డాక్యుమెంటరీ చేసి ప్రధానమంత్రి ఎక్స్‌లెన్స్‌ అవార్డుకు పంపుతామన్నారు. నేటి నుంచి జిల్లాలో ప్రత్యేక అధికారుల బాధ్యతలు పెరిగాయన్నారు. ప్రతి బుధవారం రెండు లేక మూడు గ్రామ పంచాయతీలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఓ కిరణ్‌ కుమార్‌, జెడ్పీ సీఈఓ సురేష్‌ కుమార్‌, డీఎఫ్‌ఓ సతీష్‌ కుమార్‌, డీఎంహెచ్‌ఓ కోటాచలం, డీపీఓ యాదయ్య, డీడబ్ల్యూఒ జ్యోతి పద్మ, డీఈఓ అశోక్‌, డీటీడీఓ శంకర్‌ పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ వెంకట్రావు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌
1
1/1

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement