భార్యా పిల్లల్ని ఇంటికి రమ్మని కోరగా.. నిరాకరించడంతో.. | - | Sakshi
Sakshi News home page

భార్యా పిల్లల్ని ఇంటికి రమ్మని కోరగా.. నిరాకరించడంతో..

Oct 4 2023 2:06 AM | Updated on Oct 4 2023 12:22 PM

- - Sakshi

సైదులు (ఫైల్‌)

నల్గొండ: మద్యం మత్తులో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మద్దిరాల మండలంలోని చిన్ననెమిలా గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్ననెమిలా గ్రామానికి చెందిన బొల్లికొండ సైదులు, రేణుక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం.

పెద్ద కుమారుడు డిగ్రీ, చిన్న కుమారుడు ఇంటర్‌ సెకండియర్‌ చదువుతున్నారు. సైదులు మద్యానికి బానిసై ఇంటిని పట్టించుకోకపోవడంతో భార్య రేణుక తన పిల్లలతో కలిసి ఖమ్మం వెళ్లి అక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. సోమవారం సైదులు ఖమ్మంలో ఉంటున్న భార్యాపిల్లల వద్దకు వెళ్లి వారిని ఇంటి రమ్మని కోరాడు.

మద్యం మానేస్తేనే వస్తానని భార్య చెప్పడంతో మంగళవారం ఇంటికి వచ్చిన సైదులు మనస్తాపం చెంది మద్యం మత్తులో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ రవీందర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement