
ఆమె భర్త కష్ణరాజు ఉద్యోగరీత్యా చైన్నెలో ఉంటున్నాడు.
హుజూర్‌నగర్: వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన హుజూ ర్‌నగర్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్ ఐ వెంకటరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నా యి. హుజూర్‌నగర్‌లోని చింతలబజార్‌కు చెందిన రేపన జానకమ్మ చిన్న కుమార్తె రెపన శాంతికి ఆరేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన కృష్ణంరాజుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం కాగా, శాంతికి ఆరోగ్యం బాగోలేక నెల రోజులుగా పట్టణంలోని తల్లి వద్దనే ఉంటుంది.
ఆమె భర్త కష్ణరాజు ఉద్యోగరీత్యా చైన్నెలో ఉంటున్నాడు. అయితే, శుక్రవారం శాంతి తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. దీంతో ఆమె తల్లి జానకమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.