కందనూలు: బ్యాంకు పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకొని తమ కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించుకోవాలని లీడ్ జిల్లా మేనేజర్ చంద్రశేఖర్ అన్నారు. నాగర్‌కర్నూల్ మండలంలోని పెద్దముదునూరు గ్రామంలో మంగళవారం సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్‌ఫర్మేషన్ సంస్థ నాగర్‌కర్నూల్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో జన సురక్ష సాచురేషన్ క్యాంపు నిర్వహించారు. కార్యక్రమానికి నాబార్డు డీడీఎం చందు, ఎల్‌డీఎం చంద్రశేఖర్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ బ్యాంకింగ్, బీమా పథకాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వంటి పథకాల్లో చేరడం ద్వారా ఆపద సమయంలో కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందన్నారు. అలాగే కేవైసీ నవీకరణ, బ్యాంకింగ్ సేవలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనంతరం ఇటీవల మృతిచెందిన నవాజ్, శేఖర్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో సభ్యుడిగా ఉండటంతో వారి కుటుంబాలకు రూ.2 లక్షల బీమా పరిహారం చెక్కును అందజేశారు. బీమా పథకాలు ఆపద సమయంలో బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఓబీ పెద్దముద్దనూరు మేనేజర్ చరణ్, సర్పంచ్ ఊర్మిళదేవి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు హస్తకళల్లో నైపుణ్యం సాధించాలి
ఉప్పునుంతల: విద్యార్థులు చదువుతోపాటు తమకు నచ్చిన హస్తకళల్లో నైపుణ్యం సాధించాలని తెలంగాణ హస్తకళల డిపార్ట్‌మెంట్ ప్రోగ్రాం ఆఫీసర్ చంచల్‌పాల్ అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హస్తకళల డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మాతృభూమి రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ కృషితో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న హస్తకళలపై అవగాహన, వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రకృతి ఆధారంగా లభించే వస్తువులు, మట్టి, రాళ్లు, చెట్లతో పలు రకాల సహజ సిద్ధమైన వస్తువులు తయారు చేయడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం హస్తకళల శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ ఉన్న యువతను గుర్తించి వారికి గుర్తింపు కార్డులను అందజేసి చేతి వృత్తులపైన అవగాహన కల్పిస్తుందని చెప్పారు. దీంతోపాటు డిపార్ట్‌మెంట్ సొంత ఖర్చుతో ఎగ్జిబిషన్లలో అవకాశం కల్పిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో చదువుకున్న వారందరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం లేనందున విద్యార్థులు హస్తకళలపై అభిరుచిని పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వర్క్‌షాప్‌లో ప్రతిభ ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి పెయింటింగ్, బంజారా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, బ్యాంగిల్స్ డిజైన్ తదితర వాటిపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, మాతృభూమి సంస్థ ఫౌండర్ మంజుల, అధ్యక్షుడు రమాకాంత్, ట్రైనర్స్ వందన, కవిత, అనిత, స్వప్న, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీధర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వివరాలు 8లో..
గద్వాలలో కర్ణాటక పోలీసుల సోదాలు
దొంగ బంగారం కొనుగోలు చేసిన వ్యాపారి
వ్యాపారి నుంచి రూ.6 లక్షల విలువైన బంగారం రికవరీ


