దీపావళి పండుగ సందర్భంగా జిల్లాలో అన్ని రకాల వస్తువుల ధరలు అమాంతంగా పెరిగాయి. ఏ వస్తువు కొందామన్న ధరలు అందుబాటులో లేవని వినియోగదారులు వాపోతున్నారు. ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్నారు. ధనలక్ష్మి పూజ కోసం వినియోగించే బంతిపూల ధరలకు రెక్కలొచ్చాయి. మాములు రోజుల్లో కిలో రూ.50 ఉంటే.. ప్రస్తుతం రూ.100 వరకు విక్రయిస్తున్నారు. రూ.10 నుంచి రూ.30 వరకు కొత్త కొత్త డిజైన్లలో ప్రమిదలు అందుబాటులో ఉన్నాయి. ఇక విద్యుత్ లైట్లతో కూడిన దివ్వెలు, ప్రమిదలు, రంగురంగుల లైట్లు ఆకట్టుకున్నాయి. ఈ ఎలక్ట్రికల్ ప్రమిదలను రూ.200 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. డిజైన్లను బట్టి ప్రమిదల్లో కూడా గతంలో కిలో రూ.400 ఉంటే ఈసారి రూ.600 పెరిగింది. నాణ్యమైన పేనీలు కిలో రూ.150 ఉంటే ఈసారి రూ.220 ఎగబాకింది.


