కందనూలు: తెలుగుభాషపై అభిరుచి పెంపొందించుకోవాలని డీఈఓ రమేష్‌కుమార్ అన్నారు. మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకొని జిల్లాకేంద్రలలోని సత్యసాయి మందిరంలో శనివారం క్లాస్‌మేట్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో జిల్లాలోని 20 పాఠశాలలకు చెందిన 4వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు 90 మంది పాల్గొని తమ పద్య పఠన ప్రతిభను ప్రదర్శించారు. గుర్రం జాషువా పద్యాలతోపాటు వేమన, సుమతి శతకం, ఇతర కవుల రచనలను స్పష్టమైన ఉచ్ఛారణతో, భావయుక్తంగా ఆలపించి సభికులను ఆకట్టుకున్నారు. విద్యార్థుల ఉచ్ఛారణ, పద్య భావం, ధైర్యం, ప్రదర్శన ఆధారంగా న్యాయనిర్ణేతలు మార్కులు కేటాయించారు. విజేతలకు డీఈఓ చేతులమీదుగా నగదు బహుమతులు అందజేశారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు ఆంగ్లమాధ్యమంతోపాటు తెలుగ భాషపై కూడా అభిరుచి పెంచుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో క్లాస్‌మేట్ క్లబ్ ఫౌండర్ రాఘవేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణకుమార్, డీఎస్‌ఓ శైలజ, జీసీడీఓ నిర్మల తదితరులు పాల్గొన్నారు.


