న్యూస్‌రీల్
నాగర్‌కర్నూల్
దివ్యకాంతుల..
ఆదివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2026
అచ్చంపేట/ కందనూలు: దీపావళి.. చీకట్లను పారదోలి వెలుగులు నింపే పండుగను ఆదివారం ఇంటింటా వైభవంగా జరుపుకొనేందుకు జిల్లా ప్రజలు సిద్ధమయ్యారు. ఈ ఏడాది తిథులు, నక్షత్రాల ప్రకారం ఆదివారం నరక చతుర్దశి, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత అమావాస్య రావడంతో కేదారేశ్వర నోములు నోచుకోవచ్చని పండితులు వెల్లడించడంతో ఆది, సోమవారాల్లో నోములు, వత్రాలు చేసుకోనున్నారు. ఈ మేరకు దూర ప్రాంతాల్లో ఉన్నవారు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. పూజకు వినియోగించే ప్రమిదలు, అమ్మవారి ప్రతిమలు కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. పూల గిరాకీ పెరగగా.. టపాసుల దుకాణాల్లో రద్దీ నెలకొంది.
నేడు నరక చతుర్దశి, అమావాస్య లక్ష్మిపూజలు
అందరి జీవితాల్లో
వెలుగులు నింపే పండుగ
గౌరీ నోములు, వత్రాలకు ప్రత్యేకం
ప్రమిదలు, పటాకులు,
పూలకు భలే గిరాకీ
జిల్లాలోని మార్కెట్లకు వెలుగుల శోభ


