చైనా ఉప్పు.. కృత్రిమ రంగులు.. నాసిరకం మసాలాల మోత
● హోటళ్లు, రెస్టారెంట్లలో యథేచ్ఛగా కల్తీ పదార్థాల వినియోగం
● ఉమ్మడి జిల్లాలో ఇటీవల కొరవడిన ఆహార తనిఖీలు
● టీజీ–సేఫ్ కింద 15 బృందాలతో ప్రత్యేక తనిఖీలకు సన్నాహాలు
● నాగర్‌కర్నూల్‌లో 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్
రుచికర
వంటకాల్లో..
● రెండు రోజుల క్రితం వనపర్తిలో ఫుడ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి బేకరీలో తనిఖీలు నిర్వహించగా.. కేకుల్లో ఫంగస్ కనిపించడంతో బేకరీ యజమానిపై కేసు నమోదు చేసి, దుకాణాన్ని సీజ్ చేశారు. అలాగే ఓ స్వీట్హౌస్లోని మిఠాయిలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు.
● ఇటీవల జడ్చర్లలోని పలు హోటళ్లలో తనిఖీలు చేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో నోటీసులు జారీ చేశారు.
● నాగర్‌కర్నూల్, కల్వకుర్తిలో హోటళ్లు, మిఠాయి దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి, పరీక్ష నిమిత్తం పది శాంపిల్స్ ల్యాబ్‌కు పంపించారు. నాసిరకంగా ఉండడంతో అల్లం, వెల్లుల్లి పేస్టు తయారీదారులపై రెండు కేసులు నమోదు చేశారు.
● గద్వాలలో ఇటీవల ఓ డ్రైఫూట్ కేంద్రంలో తనిఖీలు చేసి నాసిరకం ఉన్నట్లు గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఈ జిల్లాలో ఈ ఏడాది 22 కేసులు నమోదు చేయడంతో పాటు రూ.1.73లక్షల జరిమానా విధించారు.


