భూగర్భ జలమట్టాలు తగ్గితే బోర్లపై ఆధారపడే రైతులకు నీటి లభ్యత సమస్యగా మారే అవకాశం ఉంది. తాగునీటి అవసరాల కోసం భూగర్భ జలాలను వినియోగించే గ్రామాల్లోనూ అప్రమత్తత అవసరం. వర్షపు నీటిని ఒడిసిపట్టడం, చెరువులు, కుంటల్లో నీటి నిల్వలను పెంచడం, ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి నీరు ఇంకేలా చూడడం, భూగర్భ జలాల వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. మండలాల వారీగా జలమట్టాల మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. నీటి కొరత ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
వెల్దండ మండలం చెదురుపల్లి గ్రామ శివారులో తక్కువ నీరు పోస్తున్న బోరు


