చారకొండ: డిండి లిఫ్టు ఇరిగేషన్‌లో భాగంగా నిర్మిస్తున్న మండలంలోని గోకారం జలాశయంలో ముంపునకు గురవుతున్న ఎర్రవల్లి, ఎర్రవల్లి తండాలను మినహాయించాలని నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం 337వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న నిర్వాసిత మహిళలు మాట్లాడుతూ తమ గ్రామాలను ముంపు నుంచి మినహాయించాలని కోరుతూ ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే భూములు కోల్పోయాం.. ఇప్పుడు గ్రామాలను కూడా వదిలిపోవాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని, ప్రభుత్వం దిగి వచ్చే దాకా దీక్షలు కొనసాగిస్తామని వారు తేల్చిచెప్పారు.
పీజీ కళాశాలలోస్పాట్ అడ్మిషన్లు
కొల్లాపూర్: పట్టణంలోని ప్రభుత్వ పీజీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించినట్లు ప్రిన్సిపల్ అశోక్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026– 27 విద్యాసంవత్సరానికి సంబంధించి పీజీ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్లను స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. బుధవారం నుంచి 7వ తేదీ వరకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని, ఆసక్తి గలవారు విద్యార్హత ధ్రువపత్రాలతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 63099 01035, 94402 39539లకు ఫోన్ చేయాలని కోరారు.


