ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

కందనూలు: ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఎన్నో ఏళ్లుగా అంకితభావంతో సేవలందిస్తున్న ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె మంగళవారం 22వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా సమ్మె శిబిరంలో ఉద్యోగులు పోశమ్మ తల్లికి బోనం సమర్పించి నిరసన తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలను కాపాడటమే ధ్యే యంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీవితాలకే భద్రత లేకపోవడం విచారకరమన్నారు. ము ఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వర్తించి ప్రజల ప్రాణాలను కాపాడిన ఉద్యోగులు నేడు తమ కుటుంబాల భవిష్యత్‌ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం బాధాకరమన్నారు. 22 రోజుల నుంచి వివిధ పద్ధతుల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. 78 కేడర్ల ఉద్యోగుల క్రమబద్ధీకరణే ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, శ్రీనివాసులు, హైమావతి, జగన్‌, ప్రవీణ్‌, భీముడు, ప్రకాష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement