అమరచింత ఎత్తిపోతల ద్వారా ఆయకట్టుకు వస్తున్న సాగునీటిపై ఆధారపడి 4 ఎకరాల్లో వరిసా గు చేస్తున్నా. మొదట్లో సాగునీరు వస్తుందో.. రాదో అన్న సందేహాలతో కాస్త ఆలస్యంగా వరిసాగు చేశా. ఎకరం సాగుకు ఇప్పటికే రూ. 25వేల వరకు ఖర్చు పెట్టాను. నీటి సరఫరా నిలిచిపోతే పంట ఎండిపోవడం ఖాయం.
– కిరణ్‌కుమార్‌రెడ్డి, రైతు, అమరచింత
ఇక చివరి తడి మాత్రమే..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూరాల ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నాం. ఎగువ నుంచి వరద రాకపోవడంతో నిల్వ ఉన్న నీటితో ఇప్పటి వరకు సాగునీటిని వారాబందీ ద్వారా అందించాం. ప్రస్తుతం ప్రాజెక్టులో రెండున్నర టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ నెలాఖరు నుంచి 4 రోజుల పాటు మాత్రమే చివరి తడిగా కాల్వలకు సాగునీరు అందిస్తాం. – చంద్రశేఖర్, ఎస్ఈ
●


