కందనూలు: ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 33 ఫిర్యాదులను అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, డీఆర్‌ఓ పాండుతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 6 వినతులు
కందనూలు: ప్రజలు నిర్భంయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా తమ సమస్యలపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీసీఐ సీఐ శంకర్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌లో బాధితుల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 4 భూ వివాదాలకు సంబంధించినవి, 2 తగు న్యాయం చేయాలని ఫిర్యాదు వచ్చినట్లు చెప్పారు. ఆయా ఫిర్యాదుల పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్లకు పంపినట్లు వివరించారు.
చట్టాలపై అవగాహన
పెంచుకోవాలి
కందనూలు: విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ ఏపాన్ ఇండియా స్కూల్ అవేర్నెస్ క్యాంపెయిన్‌పై విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారుఆమె మాట్లాడుతూ సురక్షిత్ బచ్‌పన్ అభియాన్ అనేది దేశంలో పిల్లల రక్షణ, హక్కులు, వారి భద్రతను పెంపొందించడం కోసం ఉద్దేశించినదన్నారు. దేశవ్యాప్తంగా పిల్లల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను అరికట్టడం, చిన్న పిల్లలపై లైంగిక దాడులు, వేధింపులను అడ్డుకోవడం, పోక్సో చట్టంపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 నంబర్‌ను అత్యవసర రక్షణ కోసం ఉపయోగించుకోవాన్నారు. విద్యార్థి దశ అనేది భవిష్యత్‌కు బంగారు బాట వంటిది కాబట్టి విద్యార్థులు అందరూ జీవితంలో గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదువుకోవాలని సూచించారు. డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి శ్రీశైలం, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


