సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

సమాన పనికి.. సమాన వేతనం ఇవ్వాలి

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

కందనూలు: జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ ఎదుట ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె సోమవారం 14వ రోజు చేరుకుంది. ఈ సందర్భంగా కరోనా కిట్లు ధరించి నిరసన తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజారోగ్య సేవలందించిన ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, కార్యదర్శి బాలకృష్ణ, కుమార్‌ మాట్లాడుతూ కరోనా ప్రారంభ దశలో కిట్లు, మాస్కులు, గ్లౌజుల కొరత వంటి ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగులు ఇంటింటికి తిరిగి ఫీవర్‌ సర్వే, కరోనా లక్షణాల గుర్తింపు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, ఇతర ప్రజారోగ్య సేవలను అంకితభావంతో నిర్వహించారని గుర్తుచేశారు. కోవిడ్‌ సమయంలో ప్రజల ప్రాణాల కోసం పనిచేసిన ఉద్యోగులు ప్రస్తుతం తమ హక్కుల కోసం పోరాడాల్సి రావడం బాధాకరమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు హైమావతి, రామకృష్ణ, రాజు, మహతి, చంద్రకళ, రజియా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement