నల్లగొండకు నీళ్లు తరలిస్తే అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

నల్లగొండకు నీళ్లు తరలిస్తే అడ్డుకుంటాం

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

కందనూలు: జిల్లాలోని ఏదుల నుంచి డిండి ప్రాజెక్టుకు నీరు తరలిస్తే అడ్డుకొని తీరుతామని బీజేపీ సీనియర్‌ నేత నాగురావు నామాజీ అన్నారు. సోమవారం జిల్లాకేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు నరేందర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల ఆయన మాట్లాడారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు నుంచి నల్లగొండకు నీరు తరలిస్తే ఉమ్మడి పాలమూరు ప్రజలు మళ్లీ బొంబాయికి వలస వెళ్లే పరిస్థితి వస్తుందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు పాలమూరు ప్రజల నోట్లో మట్టికొట్టి ఆంధ్రకు నీళ్లను ధారాదత్తం చేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కపట నాటకాలతో పాలమూరుకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని, ఉమ్మడి జిల్లా నుంచి పెద్దఎత్తున బీజేపీ ఉద్యమిస్తుందని హెచ్చరించారు. బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ జిల్లాలో 20 ఏళ్లనుంచి కల్వకుర్తి ప్రజలు సాగునీటి కోసం ఎదురుచూస్తుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకంగా నల్లగొండకు నీళ్లు ఇస్తానంటుంది.. మరి కల్వకుర్తి ప్రజల పరిస్థితి ఏం కావాలని ప్రశ్నించారు. పాలమూరు– రంగారెడ్డి పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కమిటికి చైర్మన్‌గా ఎల్లేని సుధాకర్‌రావు, కన్వీనర్‌గా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నేతృత్వం వహిస్తారని చెప్పారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటించి.. ఉద్యమిస్తామని తేల్చిచెప్పారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీపై జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కొల్లాపూర్‌ చౌరాస్తాలో ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాయకులు దిలీపాచారి, నరేష్‌చారి, ఎల్లేని సుధాకర్‌రావు, వీరభద్రచారి, నాగేంద్రంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement