వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

Oct 27 2026 12:32 AM | Updated on Oct 27 2026 12:32 AM

కందనూలు: ఆదికవి, మహార్షి వాల్మీకి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతిఒక్కరూ ఉన్నతమైన విలువలతో జీవించాలని అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం అన్నారు. కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్లు హాజరై వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని అభిప్రాయపడ్డారు. రామాయణంలోని ఆదర్శాలు, ధర్మబద్ధమైన జీవన విధానం, నైతిక విలువలు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, బీసీ సంక్షేమ శాఖ సహాయ అధికారి శ్రీరాములు, డిప్యూటీ సీఈఓ గోపాల్‌నాయక్‌, జిల్లా అధికారులు ఉమాపతి, కోటయ్య, సీతారాం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement