పొట్టదశలో వరిపైరు..
జూరాల ఎడమ కాల్వ పరిధిలో 85 వేలు, కుడి కాల్వ పరిధిలో 30 వేల ఎకరాల్లో వరిసాగు చేశారు. ప్రస్తుతం వరిపైరు పొట్ట దశలో ఉంది. అయితే ఈ నెల 31 నుంచి 4 రోజులపాటు మాత్రమే కాల్వలకు సాగునీటిని వదులుతామని అధికారులు ప్రకటించడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. నవంబర్ చివరి నాటికి రెండు తడులైనా అందించాలని వేడుకుంటున్నారు. సకాలంలో వరిపంటకు నీరు అందకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. ప్రభు త్వం ఆయకట్టు రైతుల బాధను అర్థం చేసుకుని ఈ ఒక్క పంటకై నా పూర్తిస్థాయిలో సాగునీటిని వదలాలని కోరుతున్నారు.
అమరచింత ఎత్తిపోతల పరిధిలో సింగంపేటకు చెందిన రైతు విష్ణుమూర్తి 18 ఎకరాలను కౌలుకు తీసుకొని వరిసాగు చేశారు. ఇప్పటికే ఎకరానికి రూ.30 వేలు ఖర్చుపెట్టారు. ప్రస్తుతం వరిపైరు పొట్టదశలో ఉంది. జూరాల ఎడమ కాల్వ ద్వారా అమరచింత ఎత్తిపోతలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం కాల్వలకు సాగునీటిని నిలిపివేయడంతో సాగు ప్రశ్నార్థకంగా మారిందని రైతు విష్ణుమూర్తి ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ చూపి నవంబర్ చివరి వరకు సాగునీరు అందించాలని కోరుతున్నారు.
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పూర్తిగా నిలిచిపోవడంతో ఆయకట్టు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం జూరాలలో 2.862 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండటంతో ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. రానున్న గడ్డుకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక తాగునీటి అవసరాలకే జలాశయంలోని నీటిని నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో అధికారులు జూరాల కుడి, ఎడమ కాల్వలకు శనివారం సాగునీటిని నిలిపివేశారు. ఎగువ నుంచి వరదలు వస్తేనే నవంబర్ వరకు సాగునీటిని విడుదలచేసే అవకాశాలు ఉన్నాయని.. వరద రాకపోతే ఈ నెలాఖరులో 4 రోజులపాటు కాల్వలకు సాగునీటిని అందించి, ఆ తర్వాత పూర్తిస్థాయిలో నిలిపివేయనున్నట్లు పీజేపీ సీఈ రహీముద్దీన్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం వరిపైరు పొట్టదశలో ఉందని.. నవంబర్ వరకు సాగునీరు అందిస్తేనే పంట చేతికొస్తుందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు.
సాగునీరు లేక బోసిపోయిన
జూరాల ప్రధాన ఎడమ కాల్వ
జూరాలకు పూర్తిగా నిలిచిన వరద
ప్రాజెక్టులో కేవలం 2.862 టీఎంసీలు మాత్రమే నిల్వ
ఈనెల 31 నుంచి 4 రోజులు మాత్రమే చివరి తడి అందిస్తామని అధికారుల ప్రకటన
ఆందోళనలో ఆయకట్టు రైతులు
నవంబర్ వరకు సాగునీరు అందించాలని వేడుకోలు
కుడి, ఎడమ కాల్వ పరిధిలో 1.15లక్షల ఎకరాల్లో వరిసాగు


