జూరాల కాల్వలకు నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

జూరాల కాల్వలకు నీటి విడుదల

Oct 19 2026 1:13 AM | Updated on Oct 19 2026 1:13 AM

అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన కుడి, ఎడమ కాల్వలకు ఆదివారం అధికారులు నీటిని విడుదల చేశారు. వారాబందీ విధానంతో ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు 4 రోజుల పాటు వదిలి 3 రోజులు నిలిపివేశారు. మరో తడి కోసం ఆదివారం ప్రధాన ఎడమకాల్వకు 1,190 క్యూసెక్కులు, కుడికాల్వకు 730 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ఆయకట్టు పరిధిలో సుమారు 1.15 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ రకాల పంటలు సాగుచేశారు. ప్రస్తుతం వరి పంట పొట్టదశలో ఉండటంతో సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని ప్రాజెక్టు అధికారులు రైతులకు సూచిస్తున్నారు. జలాశయంలో ప్రస్తుతం 3.664 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement