అవార్డుల పరంపరం | - | Sakshi
Sakshi News home page

అవార్డుల పరంపరం

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

అవార్డుల పరంపరం

ఉప్పునుంతల పీఏసీఎస్‌ రాష్టస్థాయిలో 2020జూన్‌, 2025జూన్‌లో ఉత్తమ పీఏసీఎస్‌గా రెండుసార్లు అవార్డులు అందుకొని తోటి సంఘాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాబార్డు అవార్డుకు ఎంపికై న ఆరు పీఏసీఎస్‌లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఉప్పునుంతల పీఏసీఎస్‌ ఎంపిక కావడం గమనార్హం. పీఏసీఎస్‌లో 11,550 మంది రైతులు సంఘ సభ్యులు, 1525 మంది ఎఫ్‌పీఓ సభ్యలు ఉన్నారు. 68 శాతం రుణ రికవరీతోపాటు ఇన్‌ బ్యాలెన్సింగ్‌, బ్యాంక్‌ సేవలు, రికార్డుల నిర్వాహణ, పారామీటర్‌, సంఘం ప్రగతిపై రాష్ట్రస్థాయిలో ఈ పీఏసీఎస్‌ రెండు పర్యాయాలు నాబార్డు నుంచి అవార్డును అందుకుంటుంది. సంఘంలోని సభ్యులైన రైతులకు విరివిగా పంట, దీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, ఇతర చిరువ్యాపారులకు రుణాలు అందిస్తున్నారు. పీఏసీఎస్‌ ద్వారా రైతులకు స్వల్పకాలిక పంట రుణాలు రూ.30 కోట్లు ఇచ్చారు. దీర్ఘకాలిక రుణాలు (పాడి, కోళ్లపరిశ్రమ, గొర్రెల పెంపకం, ట్రాక్టర్లు) రూ.40కోట్లు, బంగారు ఆభరణాలపై రూ.16కోట్లు రుణాలతో రూ.86కోట్లు టర్నవర్‌తో నడుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement