డిండి లిఫ్టుతోనే పాలమూరుకు న్యాయం | - | Sakshi
Sakshi News home page

డిండి లిఫ్టుతోనే పాలమూరుకు న్యాయం

Oct 18 2026 1:06 AM | Updated on Oct 18 2026 1:06 AM

చారకొండ: డిండి లిఫ్టు ఇరిగేషన్‌ను రద్దు చేస్తే పాలమూరు రైతులకు న్యాయం జరుగుతుందని ఎర్రవల్లి నిర్వాసితులు అన్నారు. గోకారం జలాశయంలో చారకొండ మండలంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా ప్రజల భూములు కోల్పోయి నిరాశ్రయులుగా మారినా.. గ్రామాలు సైతం ముంపునకు గురవుతున్నాయని, జలాశయం సామర్థ్యం తగ్గించి.. ముంపు నుంచి తమ గ్రామాలను మినహామించాలని కోరుతూ చేపట్టిన రిలే నిరసన దీక్షలు శనివారం నాటికి 320 రోజులకు చేరాయి. ప్రభుత్వానికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి ముంపు నుంచి మినహాయించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇకనైనా తమ గ్రామాన్ని ముంపు నుంచి కాపాడాలని, అప్పటి వరకు దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు. మరోవైపు డీఎల్‌ఐ లిఫ్టును రద్దు చేయాలని, ఉమ్మడి పాలమూరులో పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తిచేయాలని శనివారం కల్వకుర్తి జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాకు ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు, మండలంలోని నాయకులు, మేధావులు, యువకులు, మహిళలు భారీగా తరలివెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement