రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం

Oct 16 2026 12:54 AM | Updated on Oct 16 2026 12:54 AM

● అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

● ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి వీపీ గౌతం

● ఎల్‌నినో ప్రభావంపై అన్ని జిల్లాల

కలెక్టర్లతో సమీక్ష

అచ్చంపేట రూరల్‌: రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం పాటుపడుతోందని, సూపర్‌ ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రైతు బాగు కోసం ప్రయత్నాలు చేస్తోందని ఎంపీ మల్లురవి అన్నారు. గురువారం అచ్చంపేటలోని వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో నూతన పాలకమండలి చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ శివ, సభ్యుల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్‌రెడ్డి హాజరై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, గతంలో లేని విధంగా సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలు, రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. రైతుల బాగుకోసం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పంట నష్టపరిహారం చెల్లించడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. నూతన పాలకమండలి రైతులకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్‌ను సీఎం, మంత్రులు, ఎంపీ సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో నాయకులు మాధవరెడ్డి, రాజేందర్‌, శివ, గౌరీశంకర్‌, రాంబాబునాయక్‌, ఛత్రునాయక్‌, రామనాథం, మల్లేష్‌, నర్సింహారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కాశన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

దేశంలో నియంత పాలన

దేశ ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని, బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఎంపీ మల్లురవి ఆరోపించారు. అచ్చంపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సర్‌ పేరుతో బీజేపీ వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారని ఆరోపించారు. గడిచిన రెండేళ్ల నుంచి రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నా.. ప్రధాని మోదీ, అమిత్‌షా నోరు మెదపడం లేదన్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కార్యక్రమానికి చేపట్టడానికి వెళ్లిన కాంగ్రెస్‌ ముఖ్యులపై లాఠీచార్జి చేయడం దారుణమన్నారు. ధర్నా చౌక్‌ లేకుండా చేస్తున్నారని, ప్రజల ఆగ్రహంతో వెయ్యి ధర్నా చౌక్‌లు పుట్టుకొస్తాయని చెప్పారు. దేశంలో బీజేపీ చివరి ప్రధానిగా మోదీ మిగిలిపోతారని జోస్యం చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement