పెట్టుబడి కూడా రాదు | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి కూడా రాదు

Oct 16 2026 12:54 AM | Updated on Oct 16 2026 12:54 AM

తొమ్మిది ఎకరాలలో పత్తి పంట సాగు చేశాను. అంతా వర్షాధార పంటనే. వర్షానికి ఏదో మాయ రోగంవచ్చి కురవకపాయే. పంట ఎదుగలేదు. ఉన్న కాయలతో ఎకరానికి 2–3 క్వింటాళ్ల దిగుబడి రావచ్చు. ధర బాగుంది కానీ.. దిగుబడి లేకపాయే. పెట్టిన పెట్టుబడి సైతం చేతికి రాదు. – దేవ్‌సింగ్‌ రైతు,

కమాల్‌పూర్‌ తండా

అప్పు మిగిలింది..

నేను ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశా. తీవ్ర వర్షభావ పరిస్థితులతో పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. పంట దిగుబడి లేక కష్టం పోను రూ.1.50 లక్షల వరకు అప్పు మిగిలింది. కౌలు పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బీర్ల శివ, రైతు, మిడ్జిల్‌

22 నుంచి పత్తి కొనుగోళ్లు

సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లకు దసరా పండుగ తర్వాత 22 నుంచి స్లాట్లు ఓపెన్‌ చేస్తాం. ప్రస్తుతం మార్కెట్‌ ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ.8,667 కంటే చాలా ఎక్కువగా ఉంది. దీంతో రైతులు ఎవరూ సీసీఐ కేంద్రాల్లో విక్రయించడానికి రారు. క్వింటాకు రూ.100 వ్యత్యాసం ఉన్నా ఎక్కువ ఎక్కడ ధర ఉంటే అక్కడే అమ్ముతారు. ప్రస్తుతం తాము సీసీఐ ద్వారా కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం.

– రమేష్‌, సీసీఐ అధికారి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement