పకడ్బందీగా భూ రీ సర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా భూ రీ సర్వే

Oct 13 2026 12:53 AM | Updated on Oct 13 2026 12:53 AM

ఉప్పునుంతల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే నిబంధనల మేరకు పకడ్బందీగా చేపట్టాలని అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రా అన్నారు. సోమవారం మండలంలోని తిర్మలాపూర్‌లో నిర్వహిస్తున్న భూ రీ సర్వే ప్రక్రియను ఆమె ఆకస్మికంగా పరిశీలించి.. వివరాలను సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు గ్రామ శివారులోని ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేయడం జరిగిందని సర్వేయర్లు వివరించారు. అనంతరం గ్రామంలోని రోడ్లు, నక్ష బాటలు, దారులను గుర్తించి సర్వే చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. సబ్‌ కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ సునీత, షఫీఉల్లా, సర్పంచు శ్రీకాంత్‌ తదితరులున్నారు.

ప్రజలు నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలి

నాగర్‌కర్నూల్‌: ప్రజలు నిర్భయంగా పోలీస్‌ సేవల్ని వినియోగించుకోవాలని ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 7 ఫిర్యాదులు అందజేశారు. ఇందులో భూమికి సంబంధించినవి 4, తక్షణ పరిష్కారానికి సంబంధించినవి 3 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతిభద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ పని చేస్తుందన్నారు.

సమాంతర కాల్వకు

నీటి సరఫరా

అమరచింత: జూరాల జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని చెబుతున్న అధికారులు సమాంతర కాల్వకు మాత్రం నీటి సరఫరాను నిలిపివేయలేకపోతున్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలకు నీటిని నిలిపివేసిన అధికారులు సమాంతర కాల్వకు మాత్రం నీటిని వదలడం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా రోజు 900 క్యూసెక్కుల నీరు పారుతోందని.. ఎగువన ఉన్న ఆయకట్టు పంటలు ఎండుముఖం పడుతున్నా పట్టించుకోని అధికారులు సమాంతర కాల్వకు మాత్రం సాగునీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలోనే సమాంతర కాల్వకు నీటిని విడుదల చేయాలనే నిబంధన ఉన్నా వరద లేని సమయంలో కూడా నీటిని వదలడం ఏమిటని రైతులు అధికారుల వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని సమాంతర కాల్వ ఏఈ మహేందర్‌ వద్ద ప్రస్తావించగా.. లిఫ్ట్‌లకు సాగునీటిని పంపింగ్‌ చేస్తున్నట్లుగానే సమాంతర కాల్వకు నీటిని వదులుతున్నారని, కాల్వ పరిధిలో వరి పంటలు ఎండిపోకుండా నీటిని సరఫరా చేస్తున్నామని బదులిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement