అగ్ని ప్రమాదాల నుంచి అడవిని రక్షించాలి | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాల నుంచి అడవిని రక్షించాలి

Oct 13 2026 12:53 AM | Updated on Oct 13 2026 12:53 AM

అచ్చంపేట రూరల్‌: అడవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ అకాడమీ కోర్సు డైరెక్టర్‌ శ్రీనివాసులు, రిటైర్డ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి గంగారెడ్డి, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ రవికాంత్‌ అన్నారు. సోమవారం అచ్చంపేటలోని జీటీడీ చౌశింగ హాల్‌లో అటవీశాఖ అధికారులు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, మంటలు వ్యాపించకుండా నియంత్రించే పద్ధతులు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే చేపట్టాల్సిన చర్యలపై శిక్షణ అందించారు. అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో అగ్ని ప్రమాదాల నియంత్రణ ప్రాధాన్యతను వివరించారు. క్షేత్రస్థాయి సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించి, అడవిలో అగ్ని ప్రమాదాలను సమర్థవంతంగా నివారించడం, నియంత్రించడం ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం అన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ అధికారులు యశ్‌చంద్ర ప్రకాష్‌ సింఘాల్‌, చంద్రశేఖర్‌, రేంజ్‌, డిప్యూటీ రేంజ్‌, సెక్షన్‌, బీట్‌ ఆఫీసర్లు, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement