మన్ననూర్: నల్లమల అటవీ ప్రాంతంలో అటవీశాఖ శిక్షణ అధికారుల పర్యటన శనివారం కొనసాగింది. రెండో రోజు సలేశ్వరం క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా దూలపల్లి అకాడమీ డీఎఫ్‌ఓ మాధవరావు సమక్షంలో అటవీ లోతట్టు ప్రాంతంలో ట్రెక్కింగ్ చేసిన 60 మంది శిక్షణ ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌బీఓలు ఈ ప్రాంతం ప్రాధాన్యత విశిష్టతలను తెలుసుకున్నారు. నల్లమల పరిసరాలు, వన్యప్రాణుల మనుగడ, ప్రాధాన్యత, అడవుల అభివృద్ధిని తెలుసుకున్న అధికారులు.. తమ సర్వీసులో ఓ మధురానుభూతిగా నిలిచిపోతాయని అన్నారు. ఆదివారం తమ పర్యటన ముగించుకొని తీరిగి అకాడమీకి చేరుకోనున్నట్లు తెలిపారు. వారి వెంట స్థానిక ఎఫ్‌ఎస్‌ఓలు మౌనిక, నర్సింహులు తదితరులు ఉన్నారు.


