దూసుకెళ్లిన ‘బాణం’ | - | Sakshi
Sakshi News home page

దూసుకెళ్లిన ‘బాణం’

Oct 10 2026 1:16 AM | Updated on Oct 10 2026 1:16 AM

● ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీడబ్ల్యూయూ కూటమి విజయఢంకా

● రీజియన్‌లోని 10 డిపోలకు గాను 8 చోట్ల గెలుపు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ/ కందనూలు/ అచ్చంపేట రూరల్‌/ కొల్లాపూర్‌/ కల్వకుర్తి టౌన్‌: ఆర్టీసీలో శుక్రవారం జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికలలో టీడబ్ల్యూయూ కూటమి విజయఢంకా మోగించింది. మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని పది డిపోలకు గాను ఎనిమిది చోట్ల ‘బాణం’ దూసుకెళ్లింది. గద్వాలలో ఈయూ అలయెన్స్‌ (నిచ్చెన గుర్తు), షాద్‌నగర్‌లో టీజేఎంయూ (గద గుర్తు) గెలుపొందినట్లు అనధికారికంగా వెల్లడైంది. సాయంత్రం 6.30 గంటల నుంచి లెక్కింపు చేపట్టి గంట నుంచి రెండు గంటల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించారు. మహబూబ్‌నగర్‌ డిపోలో మాత్రం రాత్రి 10 గంటల తర్వాతే జిల్లా కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు. ఇక లెక్కింపు పూర్తయిన అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను సీల్‌ చేసి ఐదు జిల్లాకేంద్రాల్లోని డీసీఎల్‌ కార్యాలయాల్లో భద్రపరిచారు. ఈ నెల 17న తుది ఫలితాలను కార్మిక శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement