సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 10 2026 1:16 AM | Updated on Oct 10 2026 1:16 AM

వంగూరు: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దసరా పండుగ కోసం స్వగ్రామానికి వస్తున్న సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కొండారెడ్డిపల్లిలో ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభోత్సవం, ఏటీసీ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారన్నారు. సీఎం పర్యటన సందర్భంగా భారీ ఎత్తున జనసమీకరణ ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పోలీసుశాఖ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వ శాఖల వారిగా సిద్ధం చేయాలని అన్నారు. సీఎం మధ్యాహ్నం ఒంటిగంటలోగా కొండారెడ్డిపల్లికి చేరుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గాన కొడంగల్‌ బయలుదేరుతారని చెప్పారు. సమావేశంలో సీఎం సోదరుడు, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సర్పంచ్‌ వెంకటయ్య, ఉపసర్పంచ్‌ వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే వంశీకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement