వైద్యులకు సమాన పారితోషికం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

వైద్యులకు సమాన పారితోషికం చెల్లించాలి

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

కందనూలు: జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ సూచించిన విధంగా ఇంటర్‌షిప్‌ కాలంలో ప్రతి గ్రాడ్యుయేట్‌ వైద్యుడికి స్టైఫండ్‌ పారితోషికాన్ని చెల్లించాలని ఫారెన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డా.సాయిశశాంక్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా ఆస్పత్రి ప్రధాన గేట్‌ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత జనవరి నుంచి నేటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్టైఫండ్‌ స్వీకరించలేదన్నారు. ఆస్పత్రుల్లో క్యాజువాలిటీ, ఇంటెన్సిస్‌ కేర్‌ యూనిట్‌, అన్ని విభాగాల ఓపీ సేవలు 24 గంటలపాటు అందిస్తున్నామని.. సమాన పనికి సమాన పారితోషికం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇంటెన్సివ్‌ వైద్యులు సమీర్‌, హిమాని, అక్షిత, నవీన్‌ పాల్గొన్నారు.

అవగాహనతోనే ఎయిడ్స్‌ నియంత్రణ

కందనూలు: హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాల, కళాశాల విద్యార్థులతో పాటు డ్రైవర్లు, వలస కుటుంబాలకు పూర్తి అవగాహన కల్పించాల్సిన అవసరముందని డీఎంహెచ్‌ఓ డా.కృష్ణ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నాగర్‌కర్నూల్‌, గద్వాల, వనపర్తి జిల్లాలకు చెందిన ఐసీటీసీ కౌన్సెలర్లు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో సమావేశమై జాతీయ ఎయిడ్స్‌ నియంత్రణ కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గర్భిణికి విధిగా హెచ్‌ఐవీ స్క్రీనింగ్‌ నిర్వహించి.. పాజిటివ్‌ గర్భిణులు క్రమం తప్పకుండా ఏఆర్‌టీ మందులు వాడేలా చూడాలన్నారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ సోకకుండా సిబ్బంది కృషి చేయాలని సూచించారు. సమావేశంలో డా.రఫిక్‌, రమేశ్‌, రవీంద్రరెడ్డి, సాయికుమార్‌ ఉన్నారు.

ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌గా దీపక్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రిజిస్ట్రార్‌గా పేరపాక దీపక్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ, రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసి, పారదర్శకంగా, వేగవంతంగా సేవలు అందించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement