నిర్వాసితులకు అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

నిర్వాసితులకు అండగా ఉంటాం

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

● ‘నక్కలగండి’ ముంపు బాధితులకు మెరుగైన పునరావాసం

● కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్యే వంశీకష్ణ

అచ్చంపేట/మన్ననూర్‌: ఎస్‌ఎల్‌బీసీ అవుట్‌లెట్‌ టన్నెల్‌, నక్కలగండి రిజర్వాయర్‌ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించి.. అండగా ఉంటామని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌, ఎమ్మెల్యే డా.చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి ఎస్‌ఎల్‌బీసీ సొరంగం, నక్కలగండి రిజర్వాయర్‌ పనులను అచ్చంపేట సబ్‌ కలెక్టర్‌ సలోని ఛాబ్రాతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనుల పురోగతి వివరాలను సంబంధిత అధికారులతో తెలుసుకున్నారు. అలాగే నక్కలగండి రిజర్వాయర్‌ నిర్మాణ పురోగతి, ముంపు ప్రాంతాలు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం, పరిహారం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రిజర్వాయర్‌ పరిధిలోని మర్లపాడు తండా, కేశతండా నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పునరావాసం, పరిహారం, అవసరమైన మౌలిక వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement