కందనూలు: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించి అతని అరెస్టు చేసి విచారణ జరిపించాలని సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీను ఆధ్వర్యంలో చేపట్టిన నాయకులు మాట్లాడుతూ దేశంలోని అత్యున్నత ప్రజాస్వామ్యక సంస్థలలో ఒకటైన ఎన్నికల కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలమైన విధానాన్ని అమలు చేస్తున్నాయని ఆరోపించారు. దేశ పౌరులైన 13 కోట్ల మంది ఓట్లను తొలగించిన ఎన్నికల కమిషన్ తిరిగి వెంటనే చేర్చాలని, వివాదాలకు కారణమైన ఫాం–6ను సవరించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలో పోలీసులు ప్రవర్తించిన తీరు సరైంది కాదని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కేశవులుగౌడ్, నాయకులు గీత, శివశంకర్ పాల్గొన్నారు.
.............


