డీ–5 కాల్వవకు సాగునీరందించాలి | - | Sakshi
Sakshi News home page

డీ–5 కాల్వవకు సాగునీరందించాలి

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

కొల్లాపూర్‌ రూరల్‌: కొల్లాపూర్‌ మండలం సున్నపుతండా సమీపంలోని కేఎల్‌ఐ ప్రాజెక్టు ప్రధాన కాల్వకు అనుసంధానమైన డీ–5 కాల్వకు సాగునీరు వదలాలని కుడికిల్ల, నార్లాపూర్‌, సున్నపుతండా రైతులు శనివారం సున్నపుతండా సమీపంలో జరుగుతున్న పాలమూరు ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. సున్నపుతండా సమీపంలో ఉన్న కేఎల్‌ఐ డీ–5 పంట కాల్వ లింకును కట్‌ చేయడంతో ఆయా గ్రామాలకు చెందిన 2వేల ఎకరాల్లో రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. మూడు వారాలుగా అధికారులు కాల్వకు సాగునీరు విడుదల చేయడంలేదని వాపోయారు. పాలమూరు ప్రాజెక్టు నార్లాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి మిషన్‌ భగీరథ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు జరగడంతో కాల్వ లింకును అధికారులు కట్‌ చేశారని, మోటర్ల ద్వారా పంటలు ఎండిపోకుండా కాల్వకు సాగునీరు ఇస్తామన్న అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. మూడు వారాల నుంచి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే పనులను అడ్డుకుంటున్నట్లు పేర్కొన్నారు. అధికారులు మాత్రం స్పందించడం లేదని, రైతులు పాలమూరు ప్రాజెక్టు పనులు చేస్తున్న వాహనాలను సున్నపుతండా నుంచి తీర్నంపల్లి వరకు పనులు చేయకుండా అడ్డుకున్నారు. డీ–5 కాల్వకు సాగునీరు ఇచ్చే వరకు నిరసన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో కుడికిల్ల, నార్లాపూర్‌, సున్నపుతండా రైతులు పాల్గొన్నారు. నిరసనపై ఈఈ అమర్‌సింగ్‌ను వివరణ కోరగా స్పందించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement