అకాడమిక్‌ రికార్డులు సమర్పించాలి: వీసీ | - | Sakshi
Sakshi News home page

అకాడమిక్‌ రికార్డులు సమర్పించాలి: వీసీ

Sep 30 2026 1:10 AM | Updated on Sep 30 2026 1:10 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: అకాడమిక్‌ రికార్డులను ఎప్పటికప్పుడు యూనివర్సిటీకి సమర్పించాలని పీయూ వీసీ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో వివిధ కళాశాలల ప్రిన్సిపాల్‌తో నిర్వహించిన సమీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. టీచింగ్‌ డైరీలు క్రమం తప్పుకుండా నిర్వహించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని, విద్యార్థుల హాజరు శాతం పెంచడంతో పాటు అకాడమిక్‌ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలల అభివృదికధ అవసరమైన చర్యలు చేపట్టాలని, అకాడమిక్‌ ప్రమాణాలపై మరింత మెరుగుపర్చాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాళ్లు చంద్రకిరణ్‌, భూమయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement