యువత హక్కుల సాధనకు ఉద్యమించాలి | - | Sakshi
Sakshi News home page

యువత హక్కుల సాధనకు ఉద్యమించాలి

Sep 30 2026 1:10 AM | Updated on Sep 30 2026 1:10 AM

పెద్దకొత్తపల్లి: సమాజంలో జరుగుతున్న అనేక అసమానతలపై, తమ హక్కుల సాధన కోసం యువత విప్లవ యువ కిశోరం షాహిద్‌ భగత్‌సింగ్‌ స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎండీ ఫయాజ్‌ అన్నారు. మంగళవారం మండలంలోని కల్వకోలులో భగత్‌సింగ్‌ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భరత మాత వీరపుత్రుడు భగత్‌సింగ్‌ని ఈ దేవ యువత ఐకాన్‌గా తీసుకోవాలన్నారు. భగత్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్‌ కుర్మయ్య, కృష్ణ, కుర్మయ్య, ప్రకాష్‌, శేఖర్‌, వెంకటయ్య, ధర్మరాజు, శివ, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.

చెస్‌తో ఏకాగ్రత, మేధోశక్తి పెంపు

ఉప్పునుంతల: చెస్‌ క్రీడతో విద్యార్థుల ఆలో చన శక్తి, ఏకాగ్రతతోపాటు మేధోశక్తి పెంపొందుతుందని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అండర్‌– 14, 17 విభా గాల్లో 70వ జిల్లాస్థాయిలో నిర్వహించిన చెస్‌ టోర్నమెంట్‌ పోటీలను ప్రారంభించిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. క్రీడల్లో పాల్గొనడం వలన ఆరోగ్యం శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు. పోటీలకు జిల్లాలోని ఆయా పాఠశాలల నుంచి 285 మంది విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన విజేతలను రాష్ట్రస్థాయి చెస్‌ పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌ శ్రీనివాసులు, డీసీసీ ఉపాధ్యక్షుడు అనంతరెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ శేఖర్‌గౌడ్‌, పీఈటీఏ అసోసియేషన్‌ అధ్యక్షుడు నిరంజన్‌యాదవ్‌, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లయ్య, మణి, స్వరూప, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కోయిల్‌సాగర్‌లో

తగ్గుతున్న నీటిమట్టం

దేవరకద్ర: కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టం రోజురోజుకూ స్వల్పంగా తగ్గుతోంది. మంగళవారం నాటికి 21.6 అడుగులకు చేరింది. ఐదు రోజుల క్రితం 21.9 అడుగుల నీరు ఉండగా.. ప్రస్తుతం 0.3 అడుగులు తగ్గింది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement