వరి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

వరి కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు

Sep 30 2026 1:10 AM | Updated on Sep 30 2026 1:10 AM

కందనూలు: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు పండించిన వరిధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం రవాణా, నిల్వ, గన్నీ బ్యాగుల లభ్యత, తేమ శాతం పరిశీలన, కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు తదితర అంశాలపై, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమన్వయ సమీక్షా సమావేశాన్ని అదనపు కలెక్టర్‌ చెన్నయ్యతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 20 మండలాల పరిధిలో 183 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి తలెత్తకుండా తగిన ప్రణాళికతో చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కొనుగోలు ప్రక్రియను సమన్వయంతో, పారదర్శకంగా నిర్వహిస్తూ, ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం రైతులకు సకాలంలో ప్రయోజనాలు అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పెంపొందించి.. అక్రమాలకు తావులేకుండా ప్రతి కేంద్రాన్ని జియో ట్యాగింగ్‌ చేసి.. పీసీఎస్‌ఏపీ పోర్టల్‌లో నమోదు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. తూకం, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లు, తాగునీటి వసతి తదితర 16 రకాల మౌలిక సదుపాయాల లభ్యతను పరిశీలించి, సంబంధిత ఫొటోలు, ఆధారాలను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ.. రైతులకు ముందస్తు సమాచారం అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement