తిమ్మాజిపేట మండలంలోని చేగుంట గ్రామ శివారులో సర్వే నం.215/ఇలో 34 గుంటల భూమిని మా తాతల నాటి నుంచి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. ఈ భూమిలో నుంచి అధికారుల తప్పిదం వల్ల 23 గుంటల భూమి వేరే వారి పేరు మీద ఆన్‌లైన్‌లో నమోదవడంతో 11 గుంటల భూమి మాత్రమే రికార్డులో ఉంది. వేరే వారి పేరు మీద ఎక్కించిన భూమిని తిరిగి తన పేరు మీద చేర్చాలని ఎన్నో రోజుల నుంచి ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం కలెక్టరేట్ వద్ద వినూత్నంగా నిరసన తెలిపారు.
– నారంజి, చేగుంట గ్రామం, తిమ్మాజిపేట మండలం


