కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలి

Sep 29 2026 12:57 AM | Updated on Sep 29 2026 12:57 AM

నాగర్‌కర్నూల్‌: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీనామా చేయాలని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌ అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ శ్రేణులు ధర్నా నిర్వహించారు. డీసీసీ అద్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల వంశీకృష్ణ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ చేపట్టిన సర్‌ ప్రక్రియ ద్వారా దేశవ్యాప్తంగా 25 కోట్ల ఓట్లు గల్లంతవుతున్నాయని ఆరోపించారు. సర్‌ ప్రక్రియతో బీజేపీ అనేక ఓట్లను తొలగించి అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్రమోదీకి ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేష్‌కుమార్‌ కీలుబొమ్మగా మారారని ఎద్దేవా చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ఓటు చోరీకి పాల్పడి.. అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తుందని, శాశ్వతంగా కేంద్రంలో అధికారంలో ఉండడానికి కుట్ర చేస్తుందని ఆరోపించారు. సర్‌ పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓట్లను తొలగించాలని ప్రయత్నిస్తుందన్నారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ కేంద్రం ఎన్ని కుట్రలు చేసినా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి రాహుల్‌గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement