కందనూలు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్‌ను కలిసి అర్జీలు అందజేశారు. భూములు, ఉపాధి కల్పించాలని, ఇతర సమస్యలపై 51 ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం చేయకూడదన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలు పరిష్కరించడం ప్రతి అధికారి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ పాండు, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 51 దరఖాస్తులు


