రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకే ప్రభుత్వ ప్రాధాన్యం
అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్..
దేశానికే ఆదర్శంగా వ్యవసాయ శాఖ
మరికొన్ని పథకాలు..
నాగర్‌కర్నూల్
● ప్రతి పేద వారికి సంక్షేమ, అభివృద్ధి పథకాలు
● ఆరుగ్యారంటీల అమలుకు కృతనిశ్చయంతో కృషి
● జిల్లాలో విద్యాభివృద్ధికి పెద్దపీట
● రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య
అత్యవసరమైతే అవస్థలే..!
మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రి ఐసీయూ విభాగంలో సరిపడా పడకలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం శ్రీ 18 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
–8లో u
కందనూలు: రాష్ట్రంలో సృష్టిస్తున్న సంపదను సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా సమస్త ప్రజానీకానికి అందించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజాపాలన దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్‌రెడ్డితో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకల జనుల సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. ప్రణాళికాబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో మనం కలిసి పయనిద్దామన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కంకణం కట్టుకుందన్నారు.
కేఎల్‌ఐలో భాగంగా అచ్చంపేట, ఉప్పునుంతల మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి పులిజాల నుంచి చంద్రసాగర్ చెరువు వరకు 15 కి.మీ., బ్రాంచ్ కెనాల్ నిర్మాణానికి రూ.107.20 కోట్లకు పరిపాలన అనుమతులు ఇవ్వడం జరిగిందని రాజయ్య వెల్లడించారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్టేజీ–1కు గాను తెలకపల్లి, ఉప్పునుంతల, లింగాల, బల్మూరు, అచ్చంపేట మండలాల్లోని 61 గ్రామాల్లో 57,200 ఎకరాలకు నీరందించడానికి రూ.1,534 కోట్ల అంచనాలతో పరిపాలన అనుమతులు పొంది అగ్రిమెంట్ పూర్తిచేయడం జరిగిందన్నారు. భూ సేకరణ సర్వే పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణమ్మ నీటిని తరలించి 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్‌తోపాటు వందలాది పల్లెలకు తాగునీరు అందించే పథకం చేపట్టామన్నారు.
తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళిక రూపొందిస్తోంది. రైతుల సంక్షేమం, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తుంది. ఒక జీవన విధానం, సంస్కృతిగా సాగుతున్న మనం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని, రైతును అగ్రభాగాన నిలపాలనే చిత్తశుద్ధితో, రైతులు అప్పులబారిన పడకుండా ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు పెట్టుబడి సాయం ఎకరాకు రూ.6 వేల చొప్పున అందజేస్తుందన్నారు. ఇందులో భాగంగా 2026–27 వానాకాలం సీజన్‌కు గాను 3.8 లక్షల మంది రైతుల ఖాతాలో రూ.422.56 కోట్లు జమ చేశామన్నారు. అలాగే రైతు బీమా పరిహారం రైతు కుటుంబాలకు జీవనోపాధి కల్పించి కుటుంబ పెద్ద లేని లోటు తీరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం వడ్లకు అదనంగా రూ.500 బోనస్ చెల్లించడం చెల్లిస్తుందన్నారు.
జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తున్న రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, చిత్రంలో కలెక్టర్ హేమంత
కేశవ్‌పాటిల్, ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జీ పాటిల్,
ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డి తదితరులు
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. జెడ్పీహెచ్‌ఎస్ తూడుకుర్తి, కేజీబీవీ పెంట్లవెల్లి, కేకేరెడ్డి పాఠశాల తెలకపల్లి విద్యార్థులు చేసిన జానపద నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రతిభచాటిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు చెన్నయ్య, దేవసహాయం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిందన్నారు. ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే దాదాపు 10.56 కోట్ల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకొని.. దాదాపు రూ.499.85 కోట్లు ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకం ద్వారా 1.18 లక్ష మంది వినియోగదారులు రూ.16.95 కోట్ల సబ్సిడీ ద్వారా లబ్ధి పొందుతున్నారు.
గృహ జ్యోతి పథకం ద్వారా జిల్లాలో 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే 1.15 లక్షల మంది వినియోగదారులకు రూ.77.62 కోట్ల సబ్సిడీతో జీరో బిల్లులు జారీ చేశామన్నారు.
కులగణన, మీసేవ ద్వారా వచ్చిన 43,422 కొత్త దరఖాస్తులను గ్రామసభలో ఆమోదించుకొని 41,323 కొత్త రేషన్ కార్డులను మంజూరు చేశామన్నారు. మిగిలిన దరఖాస్తులు పరిశీలనలో ఉండగా.. 1.9 లక్షల కుటుంబ సభ్యులను పాత కార్డులలో అదనంగా చేర్చామన్నారు.
ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 44,115 మంది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యసేవలకు గాను ప్రభుత్వం దాదాపు రూ.117.59 కోట్లు వెచ్చిందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లాకు మొదటి విడతలో 11,922 ఇళ్లు మంజూరవగా.. 9,809 మంది లబ్ధిదారులకు మంజూరు చేశామన్నారు. ఇందులో 5,269 ఇళ్లు ప్రగతిలో ఉండగా.. 2,361 ఇళ్లు పూర్తయ్యాయని, ఇందుకోసం రూ .197.24 కోట్లు లబ్ధిదారులకు చెల్లించినట్లు చెప్పారు.
జిల్లాలో నూతనంగా 74 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ తరగతులు ప్రారంభించగా.. 1,981 విద్యార్థులు చేరారన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అనుబంధ పోషకాహారం, పూర్వ ప్రాథమిక విద్య, రోగ నిరోధక సేవలు, ఆరోగ్య తనిఖీలు, రెఫరల్, పోషకాహారం, ఆరోగ్య విద్య వంటి సేవలు అందిస్తున్నామన్నారు. జిల్లాలోని 1,132 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 4,337 మంది గర్భిణులు, 2,785 మంది బాలింతలు, 38969 మంది చిన్నారులు ఆరోగ్యలక్ష్మి పథకం కింద లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.


