కందనూలు: రైస్ మిల్లర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు అనంతప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లాలోని రైస్ మిల్లులను రక్షించాలని, మిల్లర్లపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓటీఆర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, మిల్లింగ్ చార్జీలను పెంచాలని కోరారు. మిల్లర్లపై విధిస్తున్న 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీని మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు హకీం రాజేష్, ప్రధానకార్యదర్శి రవికుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.


