రైతుభరోసా @ రూ.375.99కోట్లు | - | Sakshi
Sakshi News home page

రైతుభరోసా @ రూ.375.99కోట్లు

Jul 13 2026 1:28 AM | Updated on Jul 13 2026 1:28 AM

మండలం మొత్తం అందాల్సిన సాయం భరోసా జమ అయిన నిధులు

రైతులు (రూ.కోట్లలో) అందిన రైతులు (రూ.కోట్లలో)

అచ్చంపేట 20,097 26.45 18,300 23.21

అమ్రాబాద్‌ 9,381 12.54 8,851 11.66

బల్మూర్‌ 18,022 23.19 16,196 20.62

లింగాల 13,670 19.64 12,198 18.96

పదర 6,622 10.27 6,278 9.63

ఉప్పునుంతల 18,986 27.62 17,427 23.43

వంగూరు 18,882 29.11 16,467 23,27

చారకొండ 9,910 13.51 8,767 11.27

కల్వకుర్తి 23,410 33.61 19,475 26.27

ఊర్కొండ 12,593 18.51 10,943 14.83

వెల్దండ 20,545 26.02 17,000 20.70

కోడేరు 14,836 16.49 12,992 14.61

కొల్లాపూర్‌ 17,273 17.99 15,279 16.05

పెద్దకొత్తపల్లి 25,180 27.07 22,184 24.09

పెంట్లవెల్లి 5,742 6.81 5,219 5.90

బిజినేపల్లి 27,082 27.56 23,938 24.15

నాగర్‌కరూ్‌న్ల్‌ 23,005 26.30 19,878 22.82

తాడూరు 18,366 25.61 15,848 21.42

తెలకపల్లి 21,298 29.07 18,703 25.49

తిమ్మాజిపేట 8,704 23.51 16,114 19.52

అచ్చంపేట: వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రైతుభరోసా పథకంతో జిల్లావ్యాప్తంగా ఈ నెల 10వ తేదీ నాటికి 3,02,057 మంది రైతులకు రూ. 375.99కోట్ల మేర పెట్టుబడి సాయం అందింది. పదెకరాల భూమి కలిగి ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం నిధులను ప్రభుత్వం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

రైతులకు ఆర్థికఊరట..

రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడంతో జిల్లా రైతులకు గణనీయమైన ఆర్థిక ఊరట లభించింది. వానాకాలం సాగు పనులు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు ఈ సాయాన్ని వినియోగించుకుంటున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిధులు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు చేపట్టారు. దీంతో జిల్లాలోని నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తి నియోజకవర్గాల రైతులకు వానాకాలం సాగు పెట్టుబడి సాయం సకాలంలో అందడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 3,43,604 మంది రైతులు..

జిల్లాలో మొత్తం 3,43,604 మంది రైతులు ఉండగా.. రూ. 440.87కోట్ల నిధులు జమ కావాల్సి ఉంది. అయితే జిల్లాలో 3,22,486 మంది రైతులకు సంబంఽధించి బ్యాంకు ఖాతాల వివరాలు ఆప్‌డేట్‌ చేసి ఉన్నాయి. వీరి ఖాతాలో రూ. 427.78కోట్ల జమ కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు 3,02,057 మంది రైతుల ఖాతాల్లో రూ. 375.99కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.

మండలాల వారీగా విడుదలైన రైతుభరోసా నిధులు ఇలా..

పదెకరాల వరకు పెట్టుబడి సాయం జమ

జిల్లాలో 3,02,057మంది రైతులకు లబ్ధి

వానాకాలం సాగులో అన్నదాతల నిమగ్నం

నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి..

రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం సాగుకు అవసరమైన పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 10 ఎకరాల వరకు రైతుభరోసా నిధులు జమయ్యాయి. రైతులు తమ బ్యాంకు ఖాతాలను పరిశీలించుకోవాలి. ఏమైనా సాంకేతిక సమస్యలు, ఇతర సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలి. కొత్త పట్టదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు సైతం ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని పొందవచ్చు. – చంద్రశేఖర్‌, డీఏఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement