అవసరం మేరకే యూరియా వాడాలి
తాడూరు/బిజినేపల్లి: రైతులు అవసరం మేరకే పంటల సాగుకు యూరియా వ్యవసా య శాఖ జాయింట్ డైరెక్టర్, యూరియా మానిటరింగ్ అధి కారి బాలునాయక్ అన్నారు. బుధవారం ఆయన తాడూరు, బిజినేపల్లి మండల కేంద్రాల్లో సింగిల్‌విండో, ఫర్టిలైజర్ దుకాణాల్లో యూరియా నిల్వ, పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అవసరానికి మించి పంటకు యూరియా వేస్తున్నారని, దీనివల్ల నష్టమే అధికంగా ఉంటుందన్నారు. రైతుల అవసరం మేరకు రాష్ట్రంలో యూరియా అందుబాటులో ఉందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. ఆయన వెంట జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు, ఏఓలు సందీప్‌కుమార్‌రెడ్డి, కమల్‌కుమార్, ఏఈఓలు ఫరీద్, భార్గవ్, డీలర్లు మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఉన్నారు
బిజినేపల్లిలో రికార్డులు పరిశీలిస్తున్న
అధికారి డా.బాలునాయక్


