
పాలమూరుకు ఆటుపోట్లు
ఇప్పట్లో నీటి ఎత్తిపోతలకు కనిపించని అవకాశాలు
కొల్లాపూర్: పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటి ఎత్తిపోతలు ఇప్పట్లో చేపట్టేలా కనిపించడం లేదు. ఇందుకు ప్రధానంగా పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రాజెక్టు పంప్‌హౌజ్ పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ నీటి ఎత్తిపోతలు మాత్రం రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో కచ్చితంగా నీటి ఎత్తిపోతలు చేపట్టాలని అధికారులు భావించినా.. ఆచరణకు నోచుకోలేదు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఈ ఏడాది ఆఖరి వరకు ఎత్తిపోతల కోసం ఎదురుచూడక తప్పేలా లేదు.
నార్లాపూర్‌లో నీటి నిల్వ ఇలా..
నార్లాపూర్ రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యం 6.4 టీఎంసీలు. ప్రస్తుతం పూర్తయిన పనుల ప్రకారం మూడు మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం ఉంది. దీంతో నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి 4 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం ఈ ఏడాది తరలింపునకు కేఆర్‌ఎంబీ అనుమతులు సైతం ఉన్నాయి. అయితే గతంలో నార్లాపూర్ రిజర్వాయర్‌లో 2 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. ఇటీవల కాాలంలో కేఎల్‌ఐ ద్వారా ఎత్తిపోసిన నీటిని నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి మళ్లించడంతో నీటి నిల్వ 4 టీఎంసీలకు పెరిగింది. రిజర్వాయర్‌లోకి కొత్తగా నీటిని ఎత్తిపోస్తే పలు సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇళ్లు ఖాళీ చేయని నార్లాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులు
జలాశయంలో ఇప్పటికే
నాలుగు టీఎంసీల నీటి నిల్వ
ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోస్తే ఇళ్లు మునిగిపోయే ప్రమాదం
ఒకవేళ నింపినా.. ఏదులకు తరలించేందుకు అడ్డంకులు