
గత డిసెంబర్‌లో మా బావ చనిపోతే తాళ్ల చెరువు వద్ద పూడ్చి పెట్టాం. కానీ అభివృద్ధి పేరుతో తాళ్ల చెరువు వద్ద ఉన్న సమాధులన్నీ తొలగించి, వాటిపై సీసీ రోడ్డు వేశారు. చనిపోయిన వారి జ్ఞాపకాలు లేకుండా చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే ఎక్కడో ఒకచోట పెట్టుకునే వాళ్లం. చనిపోయిన వాళ్లను చూసుకోకుండా చేయడం చాలా బాధాకరం.
– రాజు, హరిజనవాడ, వనపర్తి
భయపెట్టారు..
50 ఏళ్ల నుంచి ఉన్న సమాధులను దౌర్జన్యంగా భయపెట్టి రాత్రికి రాత్రి తొలగించారు. డబ్బుల కోసమే తాళ్లచెరువు కట్టపై నాణ్యత లేకుండా సీసీ రోడ్లు వేశారు. ఇక్కడే ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం బాధాకరం. ఇలా ఇవ్వడం నేనెక్కడ చూడలేదు. భవిష్యత్‌లో మరెక్కడ జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది.
– వెంకటేష్,21వ వార్డు కౌన్సిలర్, వనపర్తి
