బాల్యవివాహాల నిర్మూలనకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నిర్మూలనకు పాటుపడాలి

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

ఏటూరునాగారం: బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని జిల్లా ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌ అధికారి బాదావత్‌ అశోక్‌ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన, పలు చట్టాలపై విద్యార్థులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలను ప్రోత్సహించడం నేరమన్నారు. బాల్య వివాహాలతో చదువు మధ్యలోనే ఆగిపోతుందని తెలిపారు. ఉపాధి అవకాశాలు దెబ్బతినడంతో పాటు మానసిక పరిపక్వత లోపిస్తుందని వివరించారు. మేజర్లకు మాత్రమే వివాహం చేయాలని సూచించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే హెల్ప్‌లైన్‌ 1098కు కాల్‌ చేయాలని కోరారు. అలాగే ఐసీడీఎస్‌ అధికారులు, అంగన్‌వాడీ టీచర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జువాలజీ లెక్చరర్‌ రాజు, ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ రవిచంద్ర, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement