ఆధార్‌ అప్‌డేట్‌లో జాగ్రత్తలు అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆధార్‌ అప్‌డేట్‌లో జాగ్రత్తలు అవసరం

Nov 26 2026 1:23 AM | Updated on Nov 26 2026 1:23 AM

వాజేడు: ఆధార్‌ అప్‌డేట్‌లో పొరపాట్లకు తావివ్వకుండా విద్యార్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో సూచించారు. మండల పరిధిలోని పెద్దగొల్లగూడెం బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినుల భోజనశాలను పరిశీలించి పలు అంశాలపై ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తూ అవసరమైన సౌకర్యాలను కల్పించాలని సూచించారు. విద్యార్థినుల ఆధార్‌ వివరాల నమోదు, అప్‌డేషన్‌ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఆధార్‌ కార్డుల్లోని వివరాల్లో అక్షర దోషాలు, ఫొటోలు, ఇతర వ్యక్తిగత వివరాలు సక్రమంగా లేకుంటే వాటిని సరిచేయాలని సూచించారు.

ఐటీడీఏ పీఓ లెనిన్‌వత్సల్‌టొప్పో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement