తాగునీరు ఎలా? | - | Sakshi
Sakshi News home page

తాగునీరు ఎలా?

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

లీకేజీలు ఇలా..

తాగునీరు కలుషితం

వెంకటాపురం(కె) మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో గల తాగునీటి వాటర్‌ ట్యాంక్‌ వద్ద నెల రోజులుగా పైపులైన్‌ గేట్‌ వద్ద నీరు లీకేజీ అవుతోంది. దీంతో తాగునీరు కలుషితమై ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. అయినా పంచాయతీ అధికారులు, సిబ్బంది పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు పైపులైన్‌ లీకేజీ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

గేట్‌వాల్వ్‌ వద్ద వృథాగా పోతున్న నీరు

ములుగు/ఏటూరునాగారం/వెంకటాపురం(కె)/ఎస్‌ఎస్‌తాడ్వాయి/మంగపేట: జిల్లాలో వేసవి కాలం రాకముందే తాగునీటి సమస్య ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతుంటే.. మరోవైపు అందుబాటులో ఉన్న నీటిని సైతం సక్రమంగా వినియోగించుకోలేని దుస్థితి నెలకొంది. పల్లెల్లో మిషన్‌ భగీరథ తాగునీటి సరఫరాలో పైపులైన్ల లీకేజీలతో పాటు పలుచోట్ల తాగునీరు వృథాగా పోతున్న పరిస్థితి నెలకొంది. అలాగే పలు ట్యాంక్‌లకు పైపులైన్లు కనెక్షన్లు సైతం ఇవ్వకుండా ఉన్నాయి. జిల్లాలోని 10 మండలాల పరిధిలో మొత్తంగా 171 గ్రామ పంచాయతీలు ఉండగా 530 శివారు గ్రామాలు ఉన్నాయి. ఇందులో 477 పల్లెలు ఉండగా 53 గొత్తికోయగూడేలు ఉన్నాయి. అలాగే 591 ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం పలు గ్రామాల్లో మిషన్‌ భగీరథ పైపులైన్ల లీకేజీలు వృథాగా పోతున్న నీరు, తాగునీటి కలుషిత పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్టు.

తప్పని నీటి కష్టాలు

ఎస్‌ఎస్‌తాడ్వాయి మండల పరిధిలోని నార్లాపూర్‌ గ్రామపంచాయతీ పరిధి లంబాడీ తండాలో నిర్మించిన వాటర్‌ ట్యాంకు ద్వారా మిషన్‌ భగీరథ తాగునీటిని గ్రామంలోని ప్రజలందరికీ సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం తాగునీరు తండా వాసులకు మాత్రమే నల్లాల ద్వారా తాగునీరు అందుతుంది. అలాగే గ్రామంలోని బొడ్రాయి పరిధిలోని గ్రామస్తులకు మాత్రం తాగునీరు సరఫరా కావడం లేదు. మరోవైపు వాటర్‌ ట్యాంకు వద్ద లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతున్న పరిస్థితి నెలకొంది.

171 పంచాయతీల్లో మిషన్‌భగీరథ

తాగునీటి సరఫరాపై ఆందోళన

పైపులైన్ల లీకేజీలతో

కలుషితమవుతున్న తాగునీరు

కుళాయిలకు ట్యాపులు లేక

వృథాగా పోతున్న నీరు

ఇబ్బందులు పడుతున్న ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement