హుండీ, కాగడాల బహూకరణ | - | Sakshi
Sakshi News home page

హుండీ, కాగడాల బహూకరణ

Nov 25 2026 3:42 AM | Updated on Nov 25 2026 3:42 AM

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచల క్షేత్రంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామికి మండల కేంద్రానికి చెందిన పెనుమత్స కృష్ణమూర్తిరాజు–రమాదేవి దంపతులు రూ. 9వేల విలువైన ఇత్తడి హుండీని మంగళవారం బహూకరించారు. అదే విధంగా మల్లూరుకు చెందిన గొళ్లమూడి చంద్రశేఖర్‌–హరీష దంపతులు రూ.10వేల విలువైన రెండు ఇత్తడి కాగడాలను బహూకరించారు. ఈ కార్యక్రమానికి ముందుగా స్వామివారిని దర్శించుకున్న దాతల కుటుంబ సభ్యుల గోత్రనామాలతో ఆలయ పూజారులు స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కారంపూడి పవన్‌కుమార్‌ ఆచార్యులు, ఆలయ సిబ్బంది శివరాజు శేషు, ఏపీజీవీబీ రిటైర్డ్‌ మేనేజర్‌ సాగి మణివర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement