విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

ములుగు రూరల్‌: వైద్యారోగ్యశాఖ వైద్యులు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి గోపాల్‌రావు అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను వందశాతం పూర్తి చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతీ వారం సమీక్ష నిర్వహించి నెలవారి సమీక్షలో వివరాలను తెలియజేయాలన్నారు. గర్భిణుల నమోదు, ఏఎన్‌సీ చెకప్‌, ఐరన్‌ పోలిక్‌ మాత్రల వినియోగం, ప్రభుత్వ ఆస్పత్రిల్లో డెలివరీలను పెంచే విధంగా ఆరోగ్య కార్యకర్తలు కృషి చేయాలన్నారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌, టీబీ నియంత్రణ, కీటక జనిత వ్యాధుల నియంత్రణపై వైద్యాధికారులు పర్యవేక్షించాలన్నారు. అధిక ప్రమాద గర్భధారణ నిర్వాహణ నియమాలపై రాష్ట్ర ఆర్మాన్‌ ఆర్గనైజింగ్‌ జిల్లా ప్రోగ్రాం మేనేజర్‌ రోహిణి సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. మాతా, శిశు మరణాలను తగ్గించేందుకు ప్రమాదాలను ముందస్తుగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌, రంజిత్‌, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగఅన్వేష్‌, సంపత్‌, దుర్గారావు, శకుంతల, స్వరూపరాణి, సురేష్‌బాబు, ప్రవీణ్‌, నిఖిల్‌ యాదవ్‌, తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement